calender_icon.png 5 December, 2024 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులు అన్ని రంగాల్లో సత్తా చాటాలి

05-12-2024 12:29:52 AM

మేయర్ గద్వాల విజయలక్ష్మి 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (విజయక్రాంతి): దివ్యాంగులు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతూ, ఉన్నతంగా ఎదగాలని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకాంక్షిం చారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంతో పాటు ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా బుధవారం జూబ్లీహిల్స్ సీఎంటీఐ ట్రైనింగ్ సెంటర్ ఆవరణలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో  కలిసి ఆమె దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు.

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభు త్వం కట్టుబడి ఉంద న్నారు. దివ్యాంగులు తమ కాళ్ల మీద తాము జీవించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. మనోధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ దివ్యాంగులు ఏ విషయం లోనూ నిరుత్సాహ పడవద్దన్నారు. ఎక్కడా వెనుకంజ వేయకుండా స్ఫూర్తి, పోటీతత్వంతో తమ వైకల్యాన్ని అధిగమించి అనుకున్నది సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, ఆర్పీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.