calender_icon.png 4 December, 2024 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దివ్యాంగులను ప్రోత్సహించాలి

03-12-2024 07:57:19 PM

సింగరేణి ఏరియా జిఎం దేవేందర్... 

మందమర్రి (విజయక్రాంతి): దివ్యాంగులను క్రీడలతో పాటు అన్నిరంగాలలో ప్రోత్సహించాలని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ జి. దేవేందర్ కోరారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని మనో వికాస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల్లో నిగూడమైన శక్తి దాగి ఉంటుందని దాన్ని వెలికి తీసి వారిని ప్రోత్సహించాలని కోరారు. అంతర్జాతీయ  దివ్యాంగుల దినోత్సవాన్ని దివ్యాంగుల సమక్షంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎంతో ఓపికతో  శ్రమకు ఓర్చి మనో వికాస్  పిల్లలకు చదువు చెప్పడం, కొన్ని పనులలో నేర్పరులుగా తీర్చిదిద్దడం అబినందనీయమన్నారు.

మనో వికాస్ స్కూల్ పిల్లలకు సింగరేణి ఉద్యోగుల సహకారం మరువలేనిదని, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ పడుతున్నవారికి, విద్యా బుద్దులు నేర్పుతున్న ఉపాద్యాయులు, ఆయాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, డివైపిఎం ఎండి ఆసిఫ్, మనోవికాస్ స్పెషల్ స్కూల్ ఇంచార్జ్ టి సురేఖ, పేరెంట్స్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ టి రాజలింగు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.