హుజూర్ నగర్: హుజూర్ నగర్ పట్టణ, మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక టౌన్ నందు సమావేశం జరిగినది. ఇట్టి సమావేశంకు జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధికార ప్రతినిధి శ్రీ పేరెళ్లి బాబు ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ మంద కృష్ణమాదిగ పిలుపు మేరకు వికలాంగుల పెన్షన్ 4016 నుండి 6016 రూపాయల పెంపు కొరకు ఈ నెల 18వ తేది నుండి 23 వరకు సూర్యపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలులో పాల్గొనాలని, తర్వాత హైదరబాద్ లో 26వ తేదీన భారీ బహిరంగ సభలో భారీ ఎత్తులో పాల్గొనాలని కోరారు. ఇట్టి సమావేశంకు పట్టణ, మండల వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు శ్రీ పోనుగుపాటి లక్ష్మణ్ రావు, కాలం శ్రీనివాస్, ఇందిరాల పిచ్చయ్య, బంటు పుల్లయ్య, ములకలపల్లి శ్రీను, రూపారాణి తారాబి, కనకయ్య, వీరబాబు, రాకేష్, వీర నాగిరెడ్డి మొదలైన వికలాంగులు పాల్గొన్నారు.