calender_icon.png 27 October, 2024 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిలక్ మైదానంలోకి మురికి నీరు.. ఇబ్బందులు పడుతున్న వాకర్స్, క్రీడాకారులు

28-08-2024 01:00:48 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ క్రీడా మైదానంలో మురికి నీరు చేయడంతో వాకర్స్ తో పాటు క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బెల్లంపల్లి పట్టణ నడిబొడ్డులో ఉన్న సింగరేణి ప్రధాన క్రీడా మైదానం కావడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మైదానం వాకర్స్, క్రీడాకారులతో రద్దీగా ఉంటుంది. మైదానంలో ఓపెన్ జిమ్ తో పాటు షటిల్, క్యారమ్స్ ఆడుకునేందుకు వీలుగా సి ఈ ఆర్ క్లబ్ ఉండడంతో దూరప్రాంతాల నుండి కూడా సింగరేణి కార్మికుల పిల్లలు వస్తుంటారు. క్రీడా మైదానం పక్కనే మైనారిటీ బాలికల హాస్టల్ ఉంది.

అక్కడి మురుగు నీరు లీకేజీ అయి గత కొంతకాలంగా మైదానంలోకి వస్తున్నప్పటికీ సంబంధిత కళాశాల యాజమాన్యం గాని, సింగరేణి అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. మురుగునీరు మైదానంలో ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతుండడంతో క్రీడాకారులకు నిత్యం అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికైనా సంబంధిత సింగరేణి అధికారులు మురుగునీరు మైదానంలోకి రాకుండా చూడాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మైనారిటీ బాలికల హాస్టల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తిలక్ క్రీడా మైదానానికి చెందిన వాకర్స్, క్రీడాకారులు కోరుతున్నారు.