calender_icon.png 21 January, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పవిత్ర దర్గా స్థలంలో గలీజ్ పోలీస్ అపవిత్రం

21-01-2025 12:53:47 AM

అచ్చంపేట, జనవరి 20: కుల మతాల కతీతంగా జరిగే పవిత్రమైన రంగాపూర్ ఉమామహేశ్వర జాతర సందర్భంగా ఓ గలీ జ్ పోలీస్ కానిస్టేబుల్ చేసిన నిర్వాకంతో సర్వత్ర భక్తులంతా ముక్కున వేలేసుకుంటు న్నారు. దర్గా స్థలంలోనే మూత్ర విసర్జన చేస్తూ భక్తుల కంటపడ్డాడు. ఈ ఘటన నాగ ర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని రంగాపుర్ గ్రామంలో సోమవారం వెలుగు చూసింది. 

ఉమామహేశ్వర ఆలయంతో పా టు హజ్రత్ నిరంజన్ షావలి దర్గా జాతరకు కులమతాలకు అతీతంగా ప్రతి ఏటా నిర్వ హించే జాతరకు అశేషంగా భక్తులు హాజర వుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో సోమవా రం మధ్యాహ్నం అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్ భక్తుల కోసం ఏర్పా టు చేసిన తాగునీటి కులాయి వద్ద మూత్ర విసర్జన చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు.

అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి పై అధికారులకు పంపించారు. అతనిపై విచా రణ జరిపి చర్యలు తీసుకునేందుకు పోలీసు అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయంపై అచ్చంపేట ఎస్సై రమేష్ ను వివరణ కోరగా ఆ కానిస్టేబుల్ పై ఉన్నత అధికారులకు రిపోర్టు పంపిస్తున్నట్లు తెలిపారు.