తమిళ దర్శకుడు సురేశ్ సంగయ్య (48) మరణించారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. లివర్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ చేశారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. సురేశ్ సంగయ్యకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సురేశ్ సంగయ్య మరణాన్ని సినిమాటోగ్రాఫర్ శరణ్ ధృవీకరించారు.
’ఒరు కడియన్ కరు మను’ అనే చిత్రం కోసం శరణ్, సురేష్ సంగయ్య కలిసి పని చేశారు. సురేష్ సంగయ్య మరణం తమిళ సినీ ఇండస్ట్రీని తీవ్ర విషాదంలో ముంచేసింది. సురేశ్ సంగయ్య మరణంపై దర్శకుడు హలిత షమీమ్ స్పందించారు. సురేశ్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకున్నారు.
సురేశ్ సంగయ్య మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని హలిత షమీమ్ తెలిపారు. 2023లో వచ్చిన ‘సత్య సొతనై’ అనే చిత్రం ద్వారా సురేశ్ సంగయ్య చాలా ఫేమస్ అయ్యారు. కమెడియన్ యోగిబాబుతో ఓ వెబ్ సిరీస్ కూడా తీశారు.