calender_icon.png 22 March, 2025 | 12:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీల్ చూసి సెలక్ట్ చేశా..

21-03-2025 12:00:00 AM

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ కొత్త సిని మా ‘శారీ’. ఈ చిత్రంలో సత్యయాదు, ఆరాధ్యదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు గిరికృష్ణ కమల్ రూపొం దించారు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై రవిశంకర్‌వర్మ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ.. ‘మనం ఎవరితోనైనా డైరెక్ట్‌గా మాట్లాడినప్పుడు పె ద్దగా వారితో కనెక్ట్ కాము.

కానీ సోషల్ మీడియా యాప్స్ ద్వారా మాట్లాడుకున్నప్పుడు వారిని నేరుగా చూడటం లేదు గనుక త్వరగా వారితో కలిసిపోతాం. మన వ్యక్తిగతమైన విషయాలు కూడా చెప్పేస్తుం టాం. ఒక్కసారి ఎదుటివారికి దగ్గరయ్యాక భయం వల్లో సైకలాజికల్ ఫీలింగ్ వల్లో మరింతగా అటాచ్ అవుతాం. ఇలా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ‘శారీ’ సినిమా నేపథ్యమిదే. ఆరాధ్య చీరకట్టులో చేసిన రీల్ చూసి ఆమెను కాస్ట్ చేశాం. హీరో సత్య యాదు మా ట్లాడుతూ.. “ఆడిషన్ కోసం అప్లు చే సుకోవడం ద్వారా ‘శారీ’ చిత్రంలో నటించే అవకా శం దక్కింది. మూవీలో నా క్యారెక్టర్ చిన్నదే అయినా కథలో కీలకంగా ఉంటుంది” అన్నారు.

హీరోయిన్ ఆరాధ్యదేవి మాట్లాడుతూ.. “శారీ’ సినిమా నాకొక డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ పాత్రలో నటించేందుకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు డైరెక్టర్ కృష్ణకమల్. ఈ సిని మా చేయడం నాకొక వర్క్‌షాప్‌లా అనిపించింది. సత్య యాదు మంచి కోస్టార్‌” అని తెలిపింది. చిత్ర డైరెక్టర్ గిరికృష్ణకమల్ మాట్లాడుతూ.. “శారీ’ సినిమాకు నాకు ఇద్దరు గొప్ప యాక్టర్స్ సత్య యాదు, ఆరాధ్య రూపంలో దొరికారు. వీరిద్దరు బాగా పర్‌ఫార్మ్ చేయడం వల్ల దర్శకుడిగా నాపై ఒత్తిడి తగ్గింది” అని చెప్పారు.