calender_icon.png 31 March, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీని బూత్‌స్థాయి నుంచి పటిష్టం చేసేందుకే దిశానిర్దేశం

28-03-2025 02:03:48 AM

రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కెసి వేణుగోపాల్ శిక్షకుల నిర్దేశం 

ఢిల్లీలో జరిగిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్న నరేందర్‌రెడ్డి 

జిల్లా అధ్యక్షుల సమస్యలు,అభిప్రాయాలు తెలుసుకున్న అగ్రనాయకులు 

కరీంనగర్,మార్చి27(విజయక్రాంతి): ఢిల్లీ లోని ఇందిరా భవన్ లో గురువారం రాహుల్ గాంధీ,మల్లికార్జున ఖర్గే,కేసి వేణు గోపాల్ సమక్షంలో జరిగిన జిల్లా,నగర కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశంలో సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.దేశంలోని పదహారు రాష్ట్రాలలో గల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఆహ్వానించి పార్టీ బూతు స్థాయినుండి బలోపేతం చేయడానికి దిశా నిర్దేశం చేయడంతో పాటు జిల్లా అధ్యక్షుల యొక్క సమస్యలు అభిప్రాయాలు తీసుకున్నారు. భవిష్యత్తులో జిల్లా అధ్యక్షులకు మరిన్ని బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.అగ్ర నాయకులు మాట్లాడిన అనంతరం శిక్షకులు పలు అంశాలపై జిల్లా అధ్యక్షులకు శిక్షణ ఇవ్వడం జరిగింది.