calender_icon.png 14 January, 2025 | 5:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

16 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు

14-01-2025 12:21:06 AM

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది ఏప్రిల్ 1నుంచి ఈ ఏడాది జనవరి 2 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే 15.88 శాతం పెరిగి రూ.16.90 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.రిఫండ్‌లకు ముందు మొత్తం ప్రత్యక్ష పన్ను వసూళ్లు 202324 ఆర్థిక సంవత్సరంలో ఉన్న 17.21 లక్షల కోట్లనుంచి  19.94 శాతం పెరిగాయి.

కాగా ఇదే సమయంలో రిఫండ్‌లు రూ.3.74 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 42.49 శాతం ఎక్కువ. కాగా విభాగాల వారీగా చూస్తే కార్పొరేట్ పన్ను వసూళ్లు క్రితం ఏడాది ఉన్న రూ.8.33 లక్షల కోట్లనుంచి రూ.9.71కోట్లకు చేరాయి. ఇక నాన్ కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.8.58 లక్షల కోట్లనుంచి రూ.10.45 కోట్లకు పెరిగాయి. క్రితం ఏడాదితో పోలిస్తే ఈ విభాగంలో నికర వసూళ్లు  15.88 శాతం పెరిగాయి.