calender_icon.png 13 January, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల ఖాతాల్లో నేరుగా భరోసా

13-01-2025 02:31:51 AM

  1. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం 
  2. సాగుకు యోగ్యమైన భూములకే సాయం
  3. ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాదారులకూ వర్తింపు 
  4. తెలుగులో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. భూ భారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనున్నట్టు స్పష్టంచేసింది.

తద్వారా వ్యవసాయ ఉత్పాద కత పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతోపాటు ఆధునిక పద్ధతులు ఆచరించేందుకు అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చని వెల్లడించింది. భూవిస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు సాయం అందించ నున్నది. ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాదారులకు కూడా రైతు భరో సా సాయం అందజేయనున్నది.

సాగుకు యోగ్యంకాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నట్టు ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆర్బీఐ నిర్వహించే డీబీటీ పద్ధతిలో రైతుభరోసా సాయం రైతుల ఖాతాలో జమ చేయనున్నట్టు వెల్లడించింది. ఫిర్యాదుల పరిష్కార బాధ్యతను కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసు కున్నది. కాగా రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం తెలుగులో విడుదల చేసింది.