28-01-2025 04:34:29 PM
నిర్మల్ (విజయక్రాంతి): సోను మండలంలోని గంజాల్ టోర్ ప్లాజాలో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న టోల్ ప్లాజా కార్మికులను ప్రభుత్వం తొలగిస్తే టిఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధంగా ఉంటుందని డిఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కే రామ్ కిషన్ రెడ్డి అన్నారు. గంజాల్ టోల్ ప్లాజాలో కార్మికులు చేస్తున్న ఆందోళన శిబిరాన్ని మంగళవారం టిఆర్ఎస్ నేతలతో కలిసి సందర్శించి మద్దతు పలికారు. కార్మికులను తొలగించవద్దని వేతనాలు పెంచాలని వారు చేస్తున్న పోరాటానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా న్యాయం జరిగేటట్లు చూస్తానని నేతలు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జీవన్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు డాక్టర్ సుభాష్ రావు, పార్టీ నేతలు పాల్గొన్నారు.