calender_icon.png 12 October, 2024 | 3:26 AM

దౌత్యంతోనే యుద్ధాలకు పరిష్కారం

12-10-2024 12:56:46 AM

తూర్పు ఆసియా సదస్సులో ప్రధాని మోదీ

లావోస్, అక్టోబర్ 11: కొన్ని దేశాల్లో నెలకొన్న ఘర్షణ వాతావరణం దక్షిణ ప్రపంచంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. లావోస్‌లో జరుగుతోన్న తూర్పు ఆసియా సదస్సులో మోదీ శుక్రవారం ప్రసంగిస్తూ.. బుద్ధుడి బోధనలను పాటించే దేశం నుంచి వచ్చా. యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావు.

ఈ తరానికి ఇది తగదు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లోని ఘర్షణలతో గ్లోబల్ సౌత్‌పై ప్రభావం పడుతోంది. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం తీవ్ర సవాలుగా మారింది. దీన్ని ఎదుర్కొనేందుకు అందరూ కలిసిరావాలి. దేశాల మధ్య సమస్యల పరిష్కారానికి దౌత్యానికే ప్రాధాన్యమివ్వాలి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. యురేషియా, పశ్చిమాసియాల్లో శాంతి పునరద్ధరించాలి అని పేర్కొన్నారు.