07-03-2025 01:08:27 AM
చేనేత, జౌళి శాఖ ఏడీ విజయలక్ష్మి
ఖమ్మం, మార్చి -6 ( విజయక్రాంతి ): రాష్ట్ర ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లుమ్ టెక్నాలజి హైదరాబాదు లో నూతనంగా మంజూరు కాబడిన చేనేత, టెక్స్ టైల్ టెక్నాలజీ డిప్లొమా కోర్స్ లో 2025-26 సంవత్సరానికి గాను మొదటి సంవత్సరం 60 సీట్లలో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎం. విజయలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కోర్సు ఆరు సెమిస్టర్లతో 3 సంవత్సరాల కాలవ్యవధి కలిగి ఉంటుందని, ఈ కోర్సులో శిక్షణ కోరే అభ్యర్థులు 10వ తరగతి, తత్సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై, 2025 జూలై 1 నాటికి బి.సి., జనరల్ కేటగిరిలకు 23 సంవత్సరాలు, షెడ్యుల్ కులాలు, తెగల వారికి 25 సంవత్సరాల వయస్సు వరకు ఉండాలని తెలిపారు. కోర్సు చదువుటకు ఆసక్తి, అర్హత గల జిల్లాలోని అభ్యర్థులు 2025 ఏప్రిల్ మొదటి వారంలోగా హైదరాబాదులోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యునివర్సిటి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పిం చాలని, ఇతర వివరాలకు హిమజా కుమార్, ఓ.ఎస్.డి, సెల్ నెంబర్. 9030079242 లో సంప్రదించాలని సహాయ సంచాలకులు పేర్కొన్నారు.