calender_icon.png 8 April, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లీం మైనారిటీ ఆధ్వర్యంలో విందు

02-04-2025 05:55:09 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): రంజాన్ ను పురస్కరించుకొని ఉపవాస సమయంలో పలు రకాలుగా సేవలందించిన పలు ప్రభుత్వ విభాగాల అధికారులకు బుధవారం ముస్లీం మైనారిటీ ఆధ్వర్యంలో స్నేహపూర్వకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లీం మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ మాట్లాడుతూ... పవిత్ర రంజాన్ లో ముస్లీంలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, మున్సిపల్, పోలీస్ శాఖలు సహకరించయన్నారు. ప్రతి ఏటా లక్షేట్టిపేటలో మత సామరస్యం వెల్లివిరుస్తోందని వివరించారు. అనంతరం పలువురు అధికారులకు శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ నవాబ్ ఖాన్, నాయకులు అబ్బు భాయ్, జమీర్, ఇషాక్, ఇలియాస్, అన్వర్, షా ఖాన్, సజిల్ అంజుమ్, రియాజ్, మున్నా, సమీర్, శ్రీధర్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.