31-03-2025 04:21:15 PM
వైరా (విజయక్రాంతి): వైరా మున్సిపాలిటీ పరిధిలోని బోడెపుడి కాలనీ మసీద్ ఆధ్వర్యంలో కులమతాలకతీతంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. మత సామ్రాస్యాన్ని చాటుతూ 330 కుటుంబాలకు విందు భోజనాలు ఏర్పాటు చేసి వారి ఇంటికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోడెపుడి కాలనీ ఫిషరీష్ కాలనీ ముస్లింలు పాల్గొన్నారు.