calender_icon.png 16 January, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాల్లో తేలుతూ డిన్నర్

09-07-2024 02:25:07 AM

న్యూ ఢిల్లీ: సాధారణంగా ఎవరైనా ప్రేయసితో డిన్నర్ చేయాలి అనుకుంటే మంచి రెస్టారెంట్లోనో, ఫైవ్ స్టార్ హోటళ్లోనో ప్లాన్ చేస్తారు. కాదు కొంచెం వెరైటీగా ప్లాన్ చేద్దాం అనుకుంటే క్యాండిల్ లైట్ డిన్నర్, నీటిలో షిప్‌లో ప్రయాణిస్తూ డిన్నర్ వంటివి చేద్దాం అనుకుంటారు. అయితే ఓ వ్యక్తి తన ప్రేయసి కోసం చేసిన డిన్నర్ అరేంజ్‌మెంట్ ఇప్పు డు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రెండు కొండల మధ్య ఓ రోప్‌వేకు టేబుల్‌ను అమర్చి తన ప్రేయసితో కలిసి డిన్నర్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరూ వినూత్న అనుభూతి మధ్య తమ డిన్నర్ ముగించారు.  తాజాగా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 2.7 కోట్లకు పైగా మంది వీక్షించగా 40 లక్షల మంది లైక్ కొట్టారు.