calender_icon.png 20 March, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దినేశ్ త్రిపాఠి బాధ్యతల స్వీకరణ

01-05-2024 12:05:00 AM

నేవీ చీఫ్‌గా ఇటీవల నియామకం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి 26వ నేవీ చీఫ్‌గా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నావికా దళ కార్యక లాపాల డైరెక్టర్ జనరల్‌గా, వెస్ట్రన్ నావెల్ కమాండ్‌కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు. ఆర్ హరికుమార్ రిటైర్మెంట్ తర్వాత దినేశ్ బాధ్యతలు చేపట్టారు. ఈయన నియామకంపై ప్రభుత్వం ఈ నెల 19న అధికారిక ప్రకటన చేసింది. 1985 జూలైలో నియమితులైన త్రిపాఠి కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ స్పెషలిస్ట్.  కొర్వెట్ ఐఎన్‌ఎస్ కిర్చ్, ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్ త్రిశూల్ వంటి యుద్ధ నౌకలకు నాయకత్వం వహించారు.