నిజామాబాద్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష స్థానానికి దినేష్ కులచారి నామినేషన్ దాఖలు చేశారు. శనివారం రోజు బిజెపి నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షునిగా శ్రీ దినేష్ కులచారి తన జిల్లా అధ్యక్ష పదవి నామినేషన్ పత్రాలు జిల్లా ఎన్నికల అధికారి అయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వేంకటేశ్వర్లుకి అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు లోక భూపతి రెడ్డి, టక్కర్ హన్మంత్ రెడ్డి, బిజెపి జిల్లా పదాధికరలు, అసెంబ్లీ కన్వీనర్లు, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.