నిజామాబాద్:(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా దినేష్ కులాచారి నియమితులయ్యారు. రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణను నియమించగా.. జిల్లా ఎన్నికల అధికారి కాసం వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు జిల్లానుండి ఒకే నామినేషన్ రావడంతో దినేష్ అధ్యక్ష పదవి లాంఛనం గానే మారింది. ఆమెరకు దినేష్ కుల చారిని అధ్యక్షుడిగా నియమిస్తూ బిజెపి ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.