calender_icon.png 12 March, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ను కలిసిన దిండిగాల

12-03-2025 06:16:43 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): హైదరాబాద్ నగరం నందినగర్ లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని బీఆర్ఎస్ వ్యవస్థపాక సభ్యులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు దిండిగాల రాజేందర్ బుధవారం కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ప్రజల  గ్రౌండ్ రిపోర్ట్, పార్టీ నిర్మాణం, సిల్వర్ జూబ్లీ సందర్బంగా వరంగల్ నగరంలో ప్రతిష్టాత్మాకముగా లక్షలాది మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ జయప్రదం చేసేందుకు కృషి చేయాలని సూచించినట్లు తెలిపారన్నారు. అదే విధముగా పాలక కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలను, ఎన్నికలలో హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 420 హామీల అమలు కోసం ప్రజా క్షేతంలో నిలదీయాలని ముఖ్యముగా రైతులు ఇతర వర్గాల ప్రజల ఎదురుకొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చిసినట్లు దిండిగాల  తెలిపారు.