calender_icon.png 18 January, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన డిండి ఆర్‌ఐ

18-01-2025 01:08:30 AM

* లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

నల్లగొండ, జనవరి 17 (విజయక్రాంతి)/దేవరకొండ: నల్లగొండ జిల్లా డిండి (గుండ్లపల్లి మండలం) ఆర్‌ఐ శ్యామ్‌నాయక్ కల్యాణలక్ష్మి దరఖాస్తు పరిశీలనకు రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. డిండి మండలం పడమటి తండాకు చెందిన పాండునాయక్ కూతురు వివాహం రెండేళ్ల క్రితం అయింది. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేయగా రెండేళ్ల నుంచి ఆర్‌ఐ పెండింగ్‌లో పెట్టాడు.

దరఖాస్తు విచారణ, ఇతర ప్రకియ కోసం రూ. 0 వేల లంచం డిమాండ్ చేశాడు. పాండునాయక్ రూ.5 వేలు ఇచ్చినా వినలేదు. దీంతో పాండునాయక్ ఏసీబీని ఆశ్రయించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా హస్తినాపురం ఊర్మిళనగర్‌లోని తన ఇంట్లో శ్యామ్‌నాయక్ రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆర్‌ఐ ఇంటి  బంధువుల ఇండ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.