calender_icon.png 22 December, 2024 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు దిలువార్‌పూర్ బంద్

15-10-2024 12:00:00 AM

ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా రైతు జేఏసీ ఆందోళన

నిర్మల్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా దిలువార్‌పూర్ గ్రామంలో పొలాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ పనులను నిలిపివేయాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రైతు జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం దిలువార్‌పూర్ బంద్‌కు పిలుపునిచ్చారు.

మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఇథనాల్ పరిశ్రమ బాధిత రైతులతో చలో దిలువార్‌పూర్ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్టు రైతు సంఘం నాయకులు తెలిపారు. రైతులకు మద్దతుగా వ్యాపారులు, మేధావులు, ప్రజలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని కోరారు.