09-04-2025 01:03:31 AM
ఎన్‌ఐఏ కోర్టు తీర్పును సమర్ధించిన హైకోర్టు
ఉరిశిక్ష రద్దుచేయాలని హైకోర్టులో నిందితుల అప్పీలు
అప్పీళ్లను డిస్మిస్ చేసి తీర్పు వెలువరించిన రాష్ట్ర హైకోర్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): పన్నెండేండ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఆ కేసులో ఐదుగురు దోషులకు ఎన్‌ఐఏ కోర్టు 2016 డిసెంబర్ 13న విధించిన ఉరిశిక్షను హైకోర్టు సమర్థించింది.
ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చి న తీర్పును రద్దు చేయాలని కోరుతూ ఆ కేసులో దోషులుగా ఉన్న యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్, తెహసీన్ అక్తర్, అజాజ్ షేక్, జియా ఉర్ రహమాన్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి అప్పీళ్లపై జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ పీ శ్రీసుధలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం 45రోజుల పా టు సుదీర్ఘ విచారణ జరిపి తీర్పును వాయి దా వేసింది.
వారి అప్పీళ్లను డిస్మిస్ చేస్తూ ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు తాజాగా మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌ఐఏ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ విష్ణువర్ధన్ తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఈ కేసులో దోషులం తా ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
దోషుల అప్పీళ్లపై హైకోర్టు తీర్పు వెల్లడించడంతో జంట పేలుళ్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు. 12ఏండ్లుగా ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని, మిఠాయిలు పంచుకున్నారు. కోర్టు తీర్పును వీలైనంత త్వరగా అమలు చేయాలని కోరారు.
అసలేం జరిగింది..
పన్నెండేండ్ల క్రితం నగరంలో జరిగిన ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నా యి. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ఎదుట 2013 ఫిబ్రవరి 21న రాత్రి 7గంటలకు బాంబు పేలుడు జరిగింది. దాని నుంచి స్థానికులు తేరుకునేలోపే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఏ1మిర్చి సెంటర్ వద్ద మరో పేలుడు జరిగింది.
పేలుళ్లలో 18మంది మృతిచెందారు. 131మంది గాయపడ్డారు. దీనిపై సరూర్‌నగర్, మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. నాటి రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పా టు చేసింది. కాగా ఈ పేలుళ్లలో ఉగ్రవాదుల కోణం ఉన్నందున ప్రభుత్వం ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది.
కేసు దర్యాప్తును ప్రారంభించిన ఎన్‌ఐఏ పాకిస్థాన్‌లోని ఇండియన్ ముజాహిద్ అనే సంస్థ పేలుళ్లకు కారణమని తేల్చింది. ఈ కేసులో ఎన్‌ఐఏ ఆరుగురిని నిందితులుగా పేర్కొని వారిలో యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అనే నిందితులను 2013 ఆగస్టులో ఇండో నేపాల్ బోర్డర్‌లో, 2014 మేలో తెహసీన్ అక్తర్, జి యా ఉర్ రెహమాన్ రాజస్థాన్‌లో, అనంతరం ఐజాజ్‌షేక్ అనే మరో నిందితుడిని అరెస్ట్ చేసింది. 2015లో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు 157మంది సాక్షుల నుంచి సాక్ష్యాలను పరిశీలించింది