calender_icon.png 27 December, 2024 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిబ్రవరిలో దిల్‌రూబా రాక

25-12-2024 12:24:52 AM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘దిల్ రూబా’. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, సారెగమకు చెందిన నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రవి, జోజో జోస్, రాకేశ్‌రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని దర్శకుడు విశ్వకరుణ్ లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామనీ పేర్కొన్నారు. త్వరలోనే మూవీ ఫస్ట్‌లుక్, టీజర్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: డానియేల్ విశ్వాస్; సంగీతం: సామ్ సీఎస్.