calender_icon.png 11 March, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీపడని క్యారెక్టర్ కథే దిల్‌రూబా

10-03-2025 12:00:00 AM

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘దిల్‌రూబా’. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, సారెగమ మ్యూజిక్ లేబుల్ అనుబంధ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేశ్‌రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ విశ్వకరుణ్ చెప్పిన సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే.. 

నా దగ్గర ఉన్న ఒక కథను ఇద్దామని ఓరోజు కిరణ్ అబ్బవరం దగ్గరకు వెళ్లా. కథ నచ్చలేదు కానీ, నువ్వు కథ చెప్పిన విధానం బాగుందన్నారు. కొంతకాలానికి ‘దిల్‌రూబా’ కథ వినిపిస్తే.. ఓకే చేశారు. అలా ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లింది. కిరణ్ ఈ మూవీకి ఇచ్చిన సపోర్ట్‌ను మర్చిపోలేను. 

కెరీర్‌లో ఎదురుదెబ్బలు తిన్నవారికి మంచి మూవీ చేయాలనే భయం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా చెక్ చేసుకుంటాం. కిరణ్ చేసేదీ అదే. ‘క’ సక్సెస్‌తో మరింత గొప్పగా దీన్ని తీసుకురావాలనుకున్నాం. ఆ క్రమంలో కొన్ని మార్పులు చేశాం కానీ,  మూలకథలో ఎలాంటి మార్పులూ చేయలేదు.

వెస్ట్రర్న్ కల్చర్ పోకడలో సారీ, థ్యాంక్స్ చెప్పడం చాలా త్వరగా అలవాటు చేసుకున్నాం. తెలుగు లో క్షమించమని అడగలేం కానీ సారీ ఈజీగా చెప్పేస్తాం. తప్పు లేనప్పుడు సారీ ఎందుకు చెప్పాలనుకుంటాడు హీరో. ఈ వ్యక్తి త్వం తనతో ఉన్నవాళ్లకూ ఇబ్బం దే. ‘దిల్‌రూబా’లో కిరణ్ చేసిన సిద్ధు క్యారెక్టర్ కూడా తన వ్యక్తిత్వం విషయంలో రాజీ పడడు. అతని జీవితంలో ఇబ్బందులు వస్తాయి. 

‘క’ కంటే ముందే ‘దిల్‌రూబా’ మొదలైంది. ఇతర భాషలకు చెందిన ప్యాడింగ్ ఆర్టిస్టులు బిజీగా ఉండటం వల్ల మా షూటింగ్ ఆలస్యమైంది. మొదట వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో చేయాలనుకున్నాం. మంగుళూరులో బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయని అక్కడ షూట్ చేశాం. 

ప్రేమించిన వ్యక్తితో విడిపోయిన తర్వాత అందరూ ఆ లవర్‌ను శత్రువులా చూస్తుంటారు. కానీ ప్రేమ కంటే ముందు వారి మధ్య ఉండేది స్నేహమే. ఆ స్నేహాన్ని విడిపోయిన తర్వాతైనా పంచవచ్చు. దిల్‌రూబా కథలో ఇలాంటి ఎలిమెంట్స్ ఉం టాయి. డ్రాగన్ మూవీ కి మా దిల్‌రూబాకు సంబంధం లేదు.

ప్రేమక థలన్నీ ఒకటే.. తెరపై చూపించే విధానమే కొత్తగా ఉండాలి. అలాం టి కొత్త తరహా ప్రేమకథే ‘దిల్‌రూబా’. మనం చూసిన మనషులు, సందర్భాలే ఏ కథకైనా స్ఫూర్తినిస్తాయి. నేను మొదట రైటర్‌ను. అందుకే స్క్రిప్ట్ పని పర్ఫెక్ట్ అయిన తర్వాతే సినిమాకు సిద్ధమవ్వాలని అనుకుంటున్నా. ‘దిల్‌రూబా’ రిలీజ్ తర్వాత కొత్త సినిమాకు సన్నద్ధమవుతా.