మెదక్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామయ్య పల్లి గ్రామంలోఉన్నటువంటి అంగన్వాడి సెంటర్ లో సొంత భవనం లేక పాత పాడుబడిన రేకుల షెడ్డును ఏర్పాటు చేశారు. వర్షం పడితే రేకుల నుంచి నీరు కరడం వల్ల పైన టాపర్ ఏర్పాటు చేసి దాంట్లోనే చిన్నారులకు పాఠాలు మరియు భోజన సదుపాయం కలిగించారు.
గ్రామంలో ఇంకా ఇతర ప్రభుత్వ బిల్డింగులు ఉన్న వాటిని ఏర్పాటు చేయకుండా పాత రేకులా భవనంలో ఏర్పాటు చేయడంతో పిల్లల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి గ్రామంలో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాల్లో అంగన్వాడి కేంద్రాన్ని కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.