calender_icon.png 27 December, 2024 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు..

26-12-2024 01:48:12 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం అనంతరం తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. టీఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ జరిగిందని దిల్ రాజు వెల్లడించారు. తన ద్వారా సినీ పరిశ్రమ విషయాలు తెలపాలన్నారని పేర్కొన్నారు. తెలుగు సినిమాపై సీఎం తన విజన్ ఏంటో చెప్పారని దిల్ రాజు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమా (Telugu cinema)ను తీసుకెళ్లాలని సూచించారని, హైదరాబాద్ లో హాలీవుడ్ (Hollywood) సినిమాల షూటింగ్స్ కూడా జరగాలని తెలిపారు. ఇందుకు సంబంధించి సలహాలు, సూచనలు సీఎం అడిగారని తెలిపారు. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా మార్చాలన్నది ప్రభుత్వ ఆలోచన అన్నారు. 

తెలుగు సినీ పరిశ్రమకు అన్ని వర్గాల గౌరవం అందుతుందన్నారు. హైదరాబాద్ (Hyderabad)లో అన్ని భాషల సినిమాల షూటింగ్ జరగాలన్నారు. హాలీవుడ్ సినిమా షూటింగ్ ల మేరకు వసతులు కల్పించాలని కోరారు. త్వరలోనే ఇండస్ట్రీ ప్రముఖులంతా సమావేశమై ఈ అంశాలపై చర్చిస్తామన్నారు. డ్రగ్స్ పై పోరాటంలో ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. కొన్ని సంఘటనల వల్ల  ప్రభుత్వం, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ ఉందనేది అపోహ మాత్రమేనని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. సినీ పరిశ్రమకు కావాల్సిన భద్రతపై డీజీపీతో చర్చించారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి అన్నది తమ ముందున్న అతి పెద్ద లక్ష్యమని దిల్ రాజు స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ అంశాలను మరోసారి భేటీలో చర్చిస్తామన్నారు. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలు అనేవి చిన్నవిషయాలన్నారు. ప్రభుత్వం అడిగిన అంశాలపై 15 రోజుల్లో నివేదిక ఇస్తామని దిల్ రాజు (Dil raju) తెలిపారు. ప్రభుత్వం, సినీ పెద్దలతో త్వరలోనే ఈ అంశంపై కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.