calender_icon.png 30 October, 2024 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వైబ్‌సైట్లలో డిజిటల్ ధ్వంసం

30-07-2024 01:26:12 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ

సీఎస్ జోక్యం చేసుకోవాలని డిమాండ్

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): ప్రభుత్వ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాల్లో జరుగుతున్న డిజిటల్ విధ్వంసంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాల ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కోరారు. సోమవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందిస్తూ.. కేసీఆర్ పాలనలోని ముఖ్యమైన సమాచారం, వివరాలను తొలగించారని ఆరోపించారు. గత ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం, వివరాలు రాష్ట్ర ప్రజల ఆస్తి, తెలంగాణ చరిత్రలో భాగమని వాటిని కాపాడాలని కోరారు. భవిష్యత్తు తరా ల కోసం ఈ డిజిటల్ సంపదను పరిరక్షించాలని, దానికోసం తక్షణమే చర్య లు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. తగిన చర్యలు తీసుకోకపోతే  న్యాయపరంగా ముందుకు వెళ్లుతామని కేటీఆర్ హెచ్చరించారు.