calender_icon.png 14 November, 2024 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి భద్రాద్రిలో డిజిటల్ సేవలు

13-11-2024 01:16:51 AM

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 12 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల సీతారామ చంద్రస్వామి ఆలయంలో ఈ నెల 13 నుంచి డిజిటల్ సేవలు (అన్నదానం, ప్రొటోకాల్, వస్త్ర సమ ర్పణ) ప్రారంభించనున్నట్లు ఆలయ  ఈవో రమాదేవి మంగళవారం తెలిపారు.  

డిజిటల్ సేవల వివరాలు

అన్నదానం: స్వామివారి సేవలో పొల్గొన్న భక్తులు వారి ఫొటో ద్వారా అన్నదానం స్వీకరించేందుకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టోకెన్ పొందాలి. వారికి అన్న ప్రసాద సౌకర్యం కల్పించబడుతుంది. 

ప్రొటోకాల్: ప్రొటోకాల్ దర్శనం కావాల్సిన వారు ప్రొటోకాల్ ఆఫీస్‌లో డిజిటల్  సేవ ద్వారా వివరాలను నమోదు చేయించుకోవాలి. దేవస్థానం ఇచ్చే టోకెన్ ద్వారా స్వామివారిని దర్శించుకునే వీలు ఏర్పాటు చేశారు.

వస్త్ర సమర్పణ: స్వామివారికి భక్తులు సమర్పించే వివిధ వస్త్రాలను బార్ కోడ్ ద్వారా డిజిటలైజైషన్ చేస్తారు.