15-02-2025 01:03:38 AM
గద్వాల, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనలో నిరుద్యోగులకు డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్ యాప్) ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ టి. రామలింగేశ్వర గౌడ్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో తెలంగాణ జిల్లా కమిటీ డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు నిరంతర ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ( (DEET) ను రాష్ర్ట ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు.
ఈ వినూత్న AI- -ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫారమ్ యువత నైపుణ్యాలను గుర్తించి, అరతలకు అనుగుణంగా ప్రైవేట్ రంగ ఉద్యోగాలను సూచించడం ద్వారా ఉద్యోగార్ధులు పరిశ్రమలకు కీలక వారధిగా పనిచేస్తుందని తెలిపారు.
ఈ సమావేశంలో పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ టి. రామ్మోహన్, ఐటీఐ ప్రిన్సిపాల్ ఎస్.వి.వి. సత్యనారాయణ,జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ డా. ప్రియాంక, అసిస్టెంట్ కమిషనర్ అఫ్ లేబర్ పీ.జె. మహేష్ కుమార్, అడిషనల్ డీఆర్‌డీఓ నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.