10-02-2025 01:38:47 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ప్రైవేట్ పాఠశాలల్లో ఉండే డిజిటల్ పరికరాలు ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులో ఉన్నా వాటిని వినియోగిం చుకో వడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకుండా పోతోంది. అధికారుల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్‌పీ).. విద్యాబోధనలో ఉపయోగపడే డిజిటల్ ఉపకరణమిది.
ట్యాబ్‌ల ను, స్మార్ట్‌ఫోన్లను వినియోగించినంత తేలికగా వీటిని ఉపయోగించి అత్యంత సుల భంగా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించవచ్చు. కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లు విద్యాబోధనలో వీటినే విరివిగా ఉపయోగిస్తున్నాయి.
కానీ ప్రభుత్వ పాఠశాలలు మా త్రం ఈ విషయంలో వెనకబడ్డాయి. సర్కా రు బడుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు ఉన్నా వినియోగించడం లేదు. లక్షలు వెచ్చిం చి కొనుగోలు చేసి లక్షణంగా వాటిని మూలకుపడేశారు. దీంతో ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విద్యాబోధన అటకెక్కింది.
5,172 స్కూళ్లల్లో వాడటంలేదు..
వర్తమాన పరిస్థితుల్లో తరగతి గది బోధన తీరు రోజురోజుకూ మారుతోంది. విద్యార్థులను నిమగ్నం చేసేందుకు అనేక రకాల సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వస్తుండటంతో డిజిటల్ విద్యా బోధన అవసరం పెరుగుతోంది. కరోనా తదనంతర పరిస్థితుల్లో డిజిటల్ బోధన విస్తృతమయ్యింది.
ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడుల్లోనూ డిజిటల్ విద్యా బోధనను విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డిజిటల్ విద్యకు ప్రాధాన్యమిచ్చింది. మన ఊరురౌ బడి కార్య క్రమంలో భాగంగా చేపట్టిన 12 అంశాల్లో డిజిటల్ విద్య ఒకటిగా చేర్చింది.
ఈ కార్యక్రమంలో భాగంగా 5,172 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు (ఐఎఫ్‌పీ)లను సమకూర్చారు. ఈ పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు డిజిటల్ విద్యను బోధించేందుకు ఒక పాఠశాలకు మూడు చొప్పున ఐఎఫ్‌పీలను విద్యాశాఖ అందజేసింది. వీటిని తరగతి గదుల్లో బిగించారు. ఒక్కో దానికి అయిన వ్యయం రూ.3లక్షల పైమాటే.
అందని డిజిటల్ విద్య..
ఇంత విలువైన ఐఎఫ్‌పీలను బిగించి ఏడాది గడిచినా టీచర్లు వీటిని వాడటం లేదు. పుస్తకాల్లో ఉన్నవి చెప్పేసి మమ అనిపించేస్తున్నారు. టీచర్ల నిర్లక్ష్యం కారణంగా లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన పరికరాలు నిరుపయోగంగా మారాయి. ఇక కొన్ని ఐఎఫ్‌పీల సాంకేతిక సమస్యలతో పనిచేయడంలేదని పలువురు టీచర్లు అంటు న్నారు.
కొన్నింటికి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోగా, మరికొన్నింటికి వెబ్ కెమెరా, స్పీకర్లు పనిచేయడంలేదని కొందరంటున్నారు. అయితే వీటిని బిగించిన సంస్థయే మూడేం డ్ల పాటు రిపేర్లకు బాధ్యత వహిస్తుంది. కానీ ఈ విషయంపై ఆయా సంస్థలను, టెక్నిషన్ల ను సంప్రదించినవారు లేరు. ఫలితంగా కొం దరి నిర్లక్ష్యంగా విద్యార్థులకు డిజిటల్ విద్య అందడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.