calender_icon.png 11 January, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగేండ్లలో 1 ట్రిలియన్ డాలర్లకు డిజిటల్ ఎకానమీ

19-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 18 :  ప్రభుత్వం చేపడతున్న చర్యలు, యూపీఐ, 5 జీ అ డాప్షన్‌తో భారత్ 2028వ సంవత్సరానికల్లా  నాలుగేండ్లలో 1 ట్రిలియన్ డా లర్ల డిజిటల్ ఎకానమీగా ఆవిర్భవిస్తుందని ఆస్క్ క్యాపిటల్ నివేదికలో వెల్లడిం చింది. డిజిటల్ లావాదేవీలు పెరగడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ఇంటర్నెట్ వ్యాప్తిచెందడం, 4జీ, 5జీ సర్వీసులు అందుబాటులో ఉండటం భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థలో సమగ్ర మార్పులు చోటుచేసుకున్నాయని, యూపీఐ వంటి నవ టెక్నాలజీలు భారత ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేస్తున్నట్లు వివరించింది. 

2027 సంవత్సరానికల్లా దేశంలో మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో  90 శాతం యూపీఐ ద్వారా జరుగుతాయని అంచనా వేసింది. డిజిటలైజేషన్‌లో ధనిక దేశాలైన యూకే, జపాన్, జర్మనీలను కూడా భారత్ మించిపోయిందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐసీఆర్‌ఐఈఆర్) ఇటీవల వెల్లడించింది.