calender_icon.png 13 February, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడేళ్లలో 93లక్షల ఇళ్లకు.. డిజిటల్ కనెక్టివిటీ

13-02-2025 12:46:57 AM

  1. టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం
  2. రాష్ర్టంలో ఇప్పటికే 32 వేల కి.మీ పొడవున ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఏర్పాటు
  3. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఫిబ్రవరి 12(విజయక్రాంతి): మూడేళ్లలో రాష్ట్రంలోని 93లక్షల ఇండ్లకు డిజిటల్ కనెక్టివిటీని అందిస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొ న్నారు. బుధవారం సచివాలయంలో తనను కలిసిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందంతో మంత్రి భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ర్టంలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్ర్టంలో ఇప్పటికే 32 వేల కిమీ పొడవున ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను ఏర్పాటు చేసినట్టు వివరించారు.

ఈ నేపథ్యంలోనే పైటల్ ప్రాజెక్ట్ కింద డిజిటలైజేషన్ పూర్తయిన నాలుగు గ్రామాలను ఈ బృందం సందర్శించి తమ అనుభవాలను మంత్రితో పంచుకుంది. హాజిపల్లి (రంగారెడ్డి జిల్లా), మద్దూర్ (నారాయణ్ పేట), సంగుపేట (సంగారెడ్డి), అడవి శ్రీరాంపూర్ (పెద్దపల్లి) గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ వల్ల స్థానికులు పొందిన ప్రయోజనాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నట్టు వైజంతీ దేశాయ్, కింబర్లీ జాన్స్ ఆధ్వర్యంలోని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం తెలిపింది.

సమావేశంలో ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా, టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇషిరా మెహతా, అరుణ్ శర్మ, స్యూ సంజ్ ఎంగ్‌లు పాల్గొన్నారు.

వనపర్తికి ఐటీ టవర్ మంజూరు

  1. రూ. 22 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  2. నాగవరంలో రెండెకరాల్లో ఏర్పాటు 
  3. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): వనపర్తిలో ఐటీ టవర్ ఏర్పాటు చేయనున్నది. బుధవారం ఈ మేరకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్ అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మా ణ పనులకు రూ.22 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

జిల్లాకేంద్రం సమీపం లోని నాగవరంలో సర్కార్ రెండెకరాల్లో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిచనున్నది. 250 మంది సిట్టింగ్ కెపాసిటీతో ఐటీ టవర్ నిర్మించనున్నది. సీఎం రేవంత్‌రెడ్డి వనపర్తికి ఐటీ టవర్ కేటాయించిన ప్రకటించినం దుకు గాను ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ హబ్‌లు అందుబాటులోకి తీసుకురావడం అభివృద్ధికి చిహ్నమన్నారు. ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే టవర్ నిర్మాణం పూర్తి చేస్తుందన్నారు.