calender_icon.png 26 October, 2024 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ అరెస్ట్ దోపిడీలు

26-10-2024 02:18:20 AM

ఏటేటా పెరుగుతున్న ఆన్‌లైన్ నేరాలు

గత ఏడాది 

11 లక్షలకుపైగా ఫిర్యాదులు

ప్రజల్లో విస్తృత 

అవగాహన అవసరం

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఢిల్లీకి చెందిన ఓ జర్నలిస్ట్ కొద్ది రోజుల క్రితం ఆన్‌లైన్ స్కాంలో రూ.1.86 కోట్లు పోగొట్టుకున్నారు. నోయిడాకు చెందిన ఒక ప్రభుత్వ అధికారి ఇలాగే రూ.1.19 కోట్లను గుర్తు తెలియని వాళ్లకు ముట్టజెప్పారు. అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ బలవంతంగా నగ్నంగా వెబ్ కెమెరా ముందు నిల్చోవడంతోపాటు రూ.5లక్షలను పొగొట్టుకుంది. దేశవ్యాపంగా ఇటువంటి ఘటనలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా నిత్యం ఇటువంటి ఘటనలు పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇలా ప్రజలు సైబర్ నేరగాళ్ల మాట లు గుడ్డిగా నమ్మి మోసపోవడానికి ప్రధాన కారణం ‘డిజిటల్ అరెస్ట్’. దీన్ని అస్త్రంగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు పేట్రేగి పోతున్నారు. ప్రజల బలహీనతలను అడ్డుపెట్టుకుని ఆర్థికంగా కుంగదీస్తున్నారు. 

‘డిజిటల్ అరెస్ట్’ అంటే..

సైబర్ నేరగాళ్లు ముందుగా అక్రమ మార్గా ల ద్వారా ప్రజల సమాచారం తీసుకుంటారు. అనంతరం ఆ ఫోన్ నంబర్‌లకు కాల్ చేసి తమ ను తాము పోలీసులుగా, ఎయిర్‌పో ర్ట్ అధికారులుగా, న్యాయమూర్తులుగా పరిచయం చేసుకుంటారు. మీ బంధువు లేదా కుటుంబ సభ్యుడు లేదా ఫ్రెండ్  నేరం చేస్తూ అడ్డంగా బుక్కైపోయాడు, నేరం రుజువైతే కఠినమైన శిక్ష తప్పదు అని నమ్మబలుకుతారు. ఈ నేరం నుం చి తప్పించాలంటే మాకు ఇన్ని డబ్బులు ముట్టజెప్పండంటూ డీల్ మాట్లాడతారు. అవతలి వా ళ్లు ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వకుం డా, ఇతర సహాయ మార్గాలను కూడా అన్వేషించుకునేందుకు అవకాశం ఇవ్వకుండా కట్టడి చేస్తారు. ఇలా అవతలి వాళ్ల బలహీనతలను అడ్డం పెట్టుకుని ఆర్థికంగా లేదా మరో విధంగా  దోచుకోవడాన్నే ‘డిజిటల్ అరెస్ట్’ అంటారు. 

ఒక్క ఏడాదిలో 11 లక్షల ఫిర్యాదులు

నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి సైబర్ నేరాల సంఖ్య  క్రమంగా పెరుగుతోంది. 2017లో 3,466 కేసులు నమోదుగా కాగా, 2018లో ఈ సంఖ్య 3,353కు చేరింది. 2019లో 6,229 కేసులు, 2020లో 10,395 కేసులు, 2021లో 14,007 కేసులు నమోదయ్యాయి. 2022లో నమోదయిన సైబ ర్ నేరాల సంఖ్య 17,470కి చేరింది. ఫిబ్రవరిలో హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్ర పార్లమెంట్ వేదికగా 2023లో ఏకంగా 11, 28, 265 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. 

నెట్ వినియోగం పెరగడంతో..

ఒకప్పటితో పోల్చితే దేశంలో ఇంటర్నెట్ వారే సంఖ్య విపరీతంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 900 బిలియన్ల మంది ప్రజలు ఇంటర్నెట్ ఉపయో గిస్తూ డిజిటల్ గ్రోత్ సాధించారు. దీని ఫలితంగా యూపీఐ వంటి సౌలభ్యాలు విరివిగా వినియోగంలోకి వచ్చాయి. ఇదే సమయంలో కత్తికి రెండు వైపుల పదును ఉన్నట్టు డిజిటల్ అభివృద్ధి వల్ల ఏటా సైబర్ నేరాల వల్ల ఆర్థికంగా కుదేలవుతున్న బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తరహా మోసాలపై దృష్టి పెట్టింది. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రభుత్వ రంగ సంస్థలను ఆదేశించింది. అయితే సైబర్ నేరాల కట్టడి కోసం రూపొందించిన చట్టాలు కాగితాలకే పరిమి తం అవుతున్నాయనే విమర్శలు విని పిస్తున్నా యి. చట్టాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెస్తే ఈ నేరాలకు కొంత వరకు అడ్డుకట్ట పడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

ఫిర్యాదు చేయాలంటే

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న బాధితులు వెంటనే సైబర్ క్రైం హెల్ఫ్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సి ఉంటుం ది. నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in ద్వారా కూడా కంప్లుంట్ ఇవ్వొచ్చు. వీటి గురించి పెద్ద గా అవగాహన లేకపోతే స్థానిక పోలీసు స్టేషకు వెళ్లవచ్చు. మోసాన్ని గుర్తించిన వెంటనే అధికారులను సంప్రదించడం డబ్బును తిరిగి పొందడానికి అవకాశాలు ఉంటాయి.