కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కోమటిపల్లి, కేశ్‌పేట్ గ్రామ పరిసరాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. క్షుద్రపూజలు చేసి, తవ్వకాలు చేపట్టడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా ఈ గ్రామాల పరిధిలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేయగా గ్రామస్తులు నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తాజాగా మళ్లీ తవ్వకాలు చేపట్టడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.