11-12-2024 01:35:04 AM
మహబూబాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): ఏజన్సీ ప్రాంతంలో గుప్త నిధుల వేట కొనసాగుతున్నది. కాకతీయుల సమయంలో రాజులు బంగారు అభరణాలను భూమిలో పాతిపెట్టారని నమ్మి కొంత మంది తవ్వకాలు చేపడుతూ కటకటలా పాలవుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండంపల్లి గ్రామ శివారులోని దట్టమైన అటవీ ప్రాంతం పాఖాల ఒడ్డున కాకతీయుల నాటి శ్రీ రాజరాజశ్వరి శివాలయంలో జరిగింది.
శివాలయం అటవీ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీ సహాయంతో భారీ గోతి తీశారు. ఆ సమయంలో ఓ రైతు తన పంట చేను వద్దకు వెళ్లే క్రమంలో అలికిడిని గమనించాడు. అటవీ ప్రాంతంలో జేసీబీ నడుస్తున్న శబ్దాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం అందిం చాడు. గ్రామస్థులు ఘటన ప్రాంతానికి చేరుకోగానే దుండగులు జేసీబీ సహాయంతో ఉడాయించారు. గతంలో కూడా గుప్త నిధుల కోసం ఏకంగా దేవాలయంలోనే తవ్వకాలు చేసి ఆలయాన్ని ధ్వంసం చేశారు.