calender_icon.png 25 October, 2024 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వన మహోత్సవంలో 1000 మొక్కలు నాటిన డీఐజీ ఎల్ఎస్ చౌహన్

09-08-2024 05:08:23 PM

మానవాళి మనుగకు చెట్లు ఎంతో అవసరం :  జోగులాంబ డీఐజీ ఎల్.ఏస్.చౌహన్

మహబూబ్ నగర్: వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని జోన్-7 జోగులాంబ డీఐజీ ఎల్ఎస్ చౌహన్ పేర్కొన్నారు. చెట్లు లేకపోతే భవిష్యత్తులో దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నారు, భవిష్యత్ తరాల మనుగడ చాలా కష్టమని, ప్రకృతిని పరిరక్షించుకునేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం జడ్చర్ల ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొత్తం 1000 మొక్కలు నాటారు.

ఎస్పీ శ్రీమతి డి జానకి మాట్లాడుతూ... చెట్లు ఉంటే వర్షాలు పుష్కలంగా కురుస్తాయన్న విషయాన్ని గ్రహిస్తే భవిష్యత్తు తరాలకు మనం మంచి చేసిన వాళ్లమవుతామని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు. చెట్లు, అడవులు లేకపోతే వర్షాలు పడక, పంటలు పండక చాలా దుర్భర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని వివరించారు. నాటిన ప్రతి మొక్కలను కాపాడుకోవాలని సూచించారు. ప్రకృతిని పరిరక్షించుకునేందుకు అందరూ ముందుకు రావాలన్నారు.