09-03-2025 12:28:45 AM
హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): ఐఐఎంసీ కళాశాలలో ఐదు రోజులపాటు నిర్వహించిన డిఫ్యూజన్ కార్య శనివారం ముగిసింది. పిల్లల్లో వివిధ రకాల నైపుణ్యాలను పెంపొందించడానికి 80వ దశకం నుంచి ప్రతి సంవత్సరం డిఫ్యూజన్ అనే కార్యక్రమాన్ని నిర్వహి కళాశాల ప్రిన్సిపల్ కూర రఘు తెలిపారు. ఈ పోటీలకు వివిధ కళా చెందిన విద్యార్థులు పాల్గొని వారి నైపుణ్యాలను ప్రదర్శించారు. డిఫ్యూ జన్ చివరి రోజు శనివారం డాన్స్, పాటల పోటీలను, ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. విజేతలకు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను కళాశాలకు చెందిన వివిధ వి భాగాల అధిపతులు అందజేశారు. ఈ పోటీల్లో అధిక బహుమతులు గెలిచిన కస్తూ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల, సికింద్రాబాద్ ఐఐఎంసీ డిఫ్యూజన్ 2025 ఓవర్ ఆల్ ఛాంపియన్ ట్రోఫీని గెలుచు కున్నది. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ తిరుమలరావు, కళాశాల సాహిత్య, సాంస్కృ తిక కమిటీ కన్వీనర్ తన్వి, కో కన్వీనర్లు దీప, శ్రీనాథ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.