calender_icon.png 28 December, 2024 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతులకు తప్పని కష్టాలు

28-12-2024 01:55:36 AM

  1. ఇండ్ల నిర్మాణాలకు చుక్కలు చూపుతున్న అధికారులు
  2. అక్రమార్కులకు వర్తించని నిబంధనలు
  3. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో భాగోతం

కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): సొంతిల్లు కట్టుకోవడం ప్రతీఒక్కరి కల. అందుకోసం ఏండ్ల తరబడి కష్టపడి కొంత స్థలం కొనుగోలు చేసి అం దులో గూడు కట్టుకుందామంటే అనుమతుల పేరుతో అధికారులు కొర్రీలు పెడుతు న్నారు. దీంతో సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు.

వెంచర్‌లో ప్లాట్ తీసుకొని ఇల్లు కడితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవని మధ్యతరగతి కుటుంబాలు డీటీసీపీ అప్రువల్ ఉన్న వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇంటి నిర్మాణ అనుమతుల కోసం నెలలపాటు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కుమ్రంభీం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ శివారులో ఉన్న 168/B/2/2 సర్వే నెంబర్‌లో 1.752 ఎకరాల్లో 2022 లో అనుమతులు తీసుకొని వెంచర్లు వేశారు.

అందులో దాదాపు 22 ప్లాట్లు అమ్మకాలు జరిపారు. కానీ ఇంటి నిర్మా ణానికి దరఖాస్తు చేసుకోని అధికారులను సంప్రదిస్తే మాత్రం  వెంచర్ నిర్మాణం కాలేదని అనుమతులకు నిరాకరి స్తున్నారు. వెంచర్ పూర్తి కాకుండానే అమ్మకాలు చేపట్టేందుకు అధికారులు ఎలా అనుమతు లు ఇచ్చారన్న ప్రశ్న లు ఉత్పన్నమవుతున్నాయి.

కొంత మంది రియాల్టర్లు రాజకీయ నాయకులు అండతో వెంచర్లు ఏర్పాటు చేసే సమయంలో వంద శాతం అభివృద్ధి పనులు కాకుండా అమ్మకా లు జరిపి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.  డీటీసీపీవో అనుమతులు పొందిన వెంచర్‌లో మాత్రం ఇళ్లు కట్టాలంటే భూ యజమాని చుక్కలు చూడాల్సి వస్తోంది.

ఇంటి నిర్మాణానికి అర్జీ పెట్టుకొని నెలలు గడుస్తున్నా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి నుంచి ఫైల్ కదలడం లేదు. దరఖాస్తుదారులు టీపీవోను అడిగితే వెంచర్‌లో ఇంకా 10 శాతం అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని చెబుతుండటం గమనార్హం.

2023 ఫిబ్రవరికి ముందు మేజర్ గ్రామపంచాయితీగా ఉన్న సమయంలో అప్పటి అధికారులు ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. 

కావాలనే అనుమతులు ఇవ్వడం లేదు

డీటీసీపీ అఫ్రువల్ వెంచర్‌లో ప్లాట్ కొనుగోలు చేస్తే ఇంటి నిర్మాణానికి బ్యాంక్ లోన్ సులభంగా వస్తుందని, భవిష్యత్తులోనూ ఎలాంటి చిక్కులు ఉండవని భూమి తమ ఇంటి నిర్మాణానికి మున్సిపల్ అధికారులు కావాలనే అనుమతులు ఇవ్వడం లేదు. మున్సిపల్ కమిషనర్‌ను సంప్రదిస్తే టీపీవో అప్రువల్ చేస్తే నేను వెంటనే అనుమతులు మంజూరు చేస్తామని చెబుతున్నారు.

రాజేంద్రప్రసాద్, దరఖాస్తుదారుడు, ఆసిఫాబాద్

క్లియరెన్స్ చేసుకోవాల్సి ఉంది

వెంచర్ చేసిన యాజమాను లు అందులో అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత తమకు దరఖాస్తు చేసుకుంటే ఇంజినీరింగ్ విభాగం అధికారులు పరిశీలిస్తారు. అనంతరం అందులో పదిశాతం భూమి అభివృద్ధి కోసం కేటాయించాలి. డీటీసీపీ అనుమతులకు ముందు 15 శాతం ప్లాట్లు మాటిగే జ్ చేసిన వాటికి సంబంధించి రిలీజింగ్ ఇస్తాం. సంబంధిత వెంచర్ యజమానులు క్లియరెన్స్ చేసుకోవాల్సి ఉంది. క్లియరెన్స్ తర్వాతే నిర్మాణాలకు అనుమతులిస్తాం.

 యశ్వంత్, టౌన్ ప్లానింగ్ అధికారి, ఆసిఫాబాద్