ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి భోగే ఉపేందర్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వైద్య విధాన్ పరిషత్ అధినంలో నీ వైద్యశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇబ్బందులు పట్టించుకోని డీసీహెచ్ఎస్‌పై చర్యలు తీసుకోవాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్(AITUC District General Secretary Boge Upender) డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్టియు భవన్ లో సంఘం జిల్లా అధ్యక్షుడు టి.దివాకర్, అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆస్పత్రిలలో పని చేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ఐదు నెలలుగా వేతనాలు పెండింగ్ ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో మూడు వేల కుటుంబాలు వేతనాలు అందక ఆర్థికంగా చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిసిహెచ్ఎస్ లకు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్పందించి వేతనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.