calender_icon.png 16 November, 2024 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటింటి సర్వేకు ఇబ్బందులు

09-11-2024 12:34:42 PM

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటింటి సర్వేకు వెళ్తేందుకు ఎన్యూమరేటర్లు ఇబ్బందిపడుతున్నారు. తమ ఐడి కార్డులు లాక్కొని ఫొటోలు తీసుకొంటున్నారని ఎన్యూమరేటర్లు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సెక్యురిటీ సిబ్బంది లోపలికి అనుమతించట్లేదని, కొన్ని ప్రాంతాల్లో కుక్కలను వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో సర్వేకు వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఎన్యూమరేటర్లను ఇళ్లలోకి రాకుండా పలు కుటుంబాలు దుర్భాషలాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రారంభించారు. ఇంటింటి సర్వే నేటి నుంచి ప్రారంభం కావడంతో శనివారం ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నాతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.