calender_icon.png 31 October, 2024 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంటు సంస్కరణల్లో కష్టాలు

30-07-2024 01:35:43 AM

  • ఎఫ్‌ఓఆర్ సదస్సులో చర్చ

హైదరాబాద్‌లో సదస్సు

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ౨౦౨౨ డిసెంబర్ ౨౯న అమల్లోకి తెచ్చిన ఎలక్ట్రిసిటీ (అమెండ్‌మెం ట్) రూల్స్ అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మధ్యప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలితోపాటు వివిధ రా ష్ట్రాల విద్యుత్తు నియంత్రణ మండళ్లు అభిప్రాయపడ్డాయి. సోమవారం హైదరాబాద్ లోని ప్రగతి రిసార్ట్స్‌లో 92వ ఫోరం ఆఫ్ రెగ్యులేటర్స్ (ఎఫ్‌వోఆర్) సదస్సు జరిగింది. దీనికి ఎఫ్‌వోఆర్ చైర్మన్‌గా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జిష్ణు బారువా వ్యవహరించారు.

అన్ని రాష్ట్రాల విద్యుత్తు నియంత్రణ మండళ్ల చైర్మన్లు, సీఈఆర్‌సీ చైర్మన్, సభ్యులు హాజరయ్యారు. సభ్యుల నుంచి వచ్చిన సూచనలను అజెండాలో చేర్చి సదస్సులో చర్చించారు. విద్యుత్తు (సవరణల) రూల్స్ 2022తోపాటు ఆయా సందర్భాల్లో కేంద్రం నుంచి వస్తున్న నిబంధనలు, మార్గదర్షకాల  అమలులో ఎదురవుతున్న అడ్డంకులపై చర్చ జరిగింది. ఇంధన ట్రూఅప్, పవర్ పర్చేజ్ అడ్జస్ట్‌మెంట్ సర్‌చార్జీల అమలులో అడ్డంకులు ఎదురవుతున్నాయని అభిప్రాయ పడ్డారు. ఆటోమెటిక్ మంత్లీ బిల్లింగ్, వార్షిక ట్రూఅప్, డిస్కంలు దాఖలు చేయాల్సిన లెక్కల వివరాలు, రికార్డుల దాఖలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

లోతైన చర్చ

కేంద్ర మార్గదర్శకాలను అమలు చేయడంలో ఎదురవుతుతున్న అడ్డంకులు పరి ష్కరించేందుకు ఎఫ్‌వోఆర్ పరిధిలో ఏర్పాటుచేసిన వర్కింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికలపై కూడా సదస్సులో చర్చించారు. ఈ సందర్భంగా జిష్ణు బారువా మాట్లాడుతూ.. ఈఆ ర్‌సీలు నిబంధనల అమలుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించడం గొప్ప అనుభ వం అని పేర్కొన్నారు. తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి చైర్మన్ టీ శ్రీరంగారావు మాట్లాడుతూ.. ఇలాంటి సదస్సుకు మొదటి సారిగా హైదరాబాద్ వేదికగా నిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ లో చేపట్టిన ‘ప్రజల వద్దకు విద్యుత్తు నియంత్రణ మండలి’ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహించామని తెలిపారు. దీనివల్ల వినియోగదారుల హక్కులు, బాధ్యతలు, వివిధ రకాల సేవలపై అవగాహన పెరిగిందని చెప్పారు. హైదరాబాద్‌లో మొదటి నెట్ జీరో ప్లాటినమ్ రేటెడ్ బిల్డింగ్ ప్రారంభించామని వెల్లడించారు.