మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): వరదల నియంత్రణలో ప్రభుత్వానికి ముందు జాగ్రత్త లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, గట్టు రాంచందర్‌రావుతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ర్టంలోని 20 జిల్లాల్లో వర్ష ప్రభావం ఉండగా ప్రభుత్వం మొద్దునిద్ర పోయిందన్నారు. హెలికాప్టర్ కోసం ప్రయ త్నం చేసినా రాలేదని ఓ మంత్రి పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు.
ఖమ్మంలో సహా యం కోసం వరద బాధితులు 9 గంటలు వేచిచూసినా సహాయం అందలేదని.. ఓ మంత్రి హెలికాప్టర్ కోసం ఏపీ సీఎంతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకోని ప్రభుత్వానికి పరిపాలించే నైతిక హక్కు లేదన్నారు. సీఎంతో ప్రధాని మోదీ, అమిత్ షా మాట్లాడి ఉంటే తెలంగాణకు హెలికాప్టర్ కావాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. వరదల్లో మృతి చెందిన కుటుం బాలకు రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.