నిలిచిపోయిన పెన్షన్ పునరుద్ధరించాలని దివ్యాంగుడి వేడుకోలు...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వాంకిడి మండలం కొమ్మగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కొత్త దుబ్బ కూడా గ్రామానికి చెందిన దివ్యాంగుడు శ్రీనివాస్ నిలిచిపోయిన తన పెన్షన్ కోసం సంవత్సర కాలం పాటు అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కనుకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఫిబ్రవరి 2024 నుండి పెన్షన్ రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. తను అనారోగ్య సమస్యతో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో మూడు నెలలు చికిత్స చేసుకోవాల్సిన పరిస్థితి రావడంతో పెన్షన్ తీసుకోలేకపోయానని తద్వారా పెన్షన్ నిలిపివేయడం జరిగిందని ఆందోళన చెందుతున్నాడు. నిలిచిపోయిన పెన్షన్ను రోల్ బ్యాక్ చేయాలని అధికారులను వేడుకుంటున్నాడు. సంబంధిత అధికారులు స్పందించి దివ్యాంగుడికి న్యాయం చేయాలి.