calender_icon.png 20 January, 2025 | 9:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సులు సరిపోక ఇబ్బందులు

20-01-2025 06:51:38 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ బస్టాండ్ లో సోమవారం ప్రయాణికుల రద్దీ ఏర్పడడంతో ప్రయాణికులు బస్సులు సరిపోక ఇబ్బందిపడ్డారు. సోమవారం కావడం వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు తమ పిల్లలను సంక్రాంతి సెలవుల తరువాత పాఠశాలకు పంపడంతో అన్ని రూట్లలో జనాలు జనాలు ప్రత్యేక కనిపించారు. బస్సు ప్రయాణం చేసేవారు సీటు దొరకక ఎక్కేందుకు తమ పిల్లలను కిటికీలోనుంచి బస్సులోకి ఎక్కించవలసిన పరిస్థితి ఏర్పడింది. నిర్మల్ ఆర్టీసీ డిపో రద్దీని దృష్టిలో పెట్టుకొని కొన్ని రూట్లలో బస్సులను మళ్లించి ట్రాఫిక్ ను క్లియరెన్స్ చేశారు. నిర్మల్ డిఎం ప్రతిమారెడ్డి, సిఐ రాజశేఖర్, అధికారులు రమణ, ఇఆర్ రెడ్డి బస్టాండ్ లో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కష్టపడ్డారు.