calender_icon.png 26 October, 2024 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత, జౌళి రంగాలకు వేర్వేరు పథకాలు..

02-08-2024 12:05:00 AM

  1. అమలు చేయాలని వక్తల డిమాండ్ 
  2. ఆ శాఖ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశం ఉద్యోగ విరమణ 

నల్లగొండ, ఆగస్టు 1(విజయక్రాంతి): చేనేత, జౌళి రంగాలకు ప్రభుత్వం వేర్వేరు పథకాలు రూపొందించి, అమలు చేయాలని వక్తలు కోరారు. చేనేత, జౌళి శాఖ హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ ఎం వెంకటేశం ఉద్యోగ విరమణ సభ హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం జరిగింది. రాజకీయ ప్రముఖులు, చేనేత కళాకారులు, పలు సంఘాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. చేనేత, జైళి రంగానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు రూ.100 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని సీఎం ఇప్పటికే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మిల్లు, ప్రింటెడ్ వస్త్రాల నుంచి చేనేత రంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఎం వెంకటేశం రచించిన ‘ఇంట్రెన్సిక్ వేవ్స్ ఆఫ్ తెలంగాణ హ్యాండ్లూమ్స్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎల్ రమణ, మత్స్య సహకార ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, పద్మ అవార్డు గ్రహీత చింతకింద మల్లేశం, హైదరాబాద్ డీసీపీ ఆర్ వెంకటేశ్వర్లు, ఏపీకే రెడ్డి పాల్గొన్నారు.