09-04-2025 12:00:00 AM
వాట్సాప్ చాట్, వీడియోలతో విషయం వెలుగులోకి
కోల్‌కతా, ఏప్రిల్ 8: తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత పోరు రచ్చకెక్కింది. సామాజిక మాధ్యమంలో వాట్సాప్ చాట్, లీకైన వీడి యోలను బీజేపీ ఐటీ సెల్ ఇన్‌చార్జి అమిత్ మాలవీయ షేర్ చేయడంతో టీఎంసీ నేతల మధ్య జరిగిన ఘర్షణ బయటకు వచ్చింది. వీడియోలో దుర్గాపూర్ ఎంపీ కీర్తి ఆజాద్‌తో పాటు కృష్ణానగర్ ఎంపీ మ హువా మొయిత్రాపై సీరమ్‌పూర్ ఎంపీ, ఆ పార్టీ లోక్‌సభ చీఫ్ విప్ కల్యాణ్ బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కనిపించింది.
ఇటీవల ఒక ప్రజెంటేషన్‌ను సమర్పించడానికి తృణముల్ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఈసీ కార్యాలయానికి వెళ్లాలని నిర్ణయించుకుని, అందుకు ఓ సమావేశం ఏర్పాటు చేసింది. అయితే కీర్తి ఆజాద్‌తో పాటు మహువా మొయిత్రా సమావేశానికి రాకుండా ఈసీ కార్యాలయానికి వెళ్లారు. దీనిపై కల్యాణ్ బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కల్యాణ్‌కు, మహువా మధ్య మాటల యుద్ధం జరిగినట్టు తెలుస్తోంది. మహువా ప్రవర్తనపై సీఎం మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు.