calender_icon.png 29 November, 2024 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలికాలం రాత్రిళ్లు ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం

29-10-2024 02:33:14 AM

  1. దక్షిణ తెలంగాణలో ఒక డిగ్రీ తగ్గుదల
  2. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక డిగ్రీ పెరుగుదల 

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాం తి): రాష్ట్రంలో ఈ ఏడాది చలికాలంలో ఉష్ణోగ్రత లు విభిన్నంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య రుతుపవనాల రాకలో ఏర్పడిన మార్పుల వల్ల రాత్రిళ్లు ఉత్తర తెలంగాణలో ఒకలా, దక్షిణ తెలంగాణలో మరోలా ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేసింది.

నైరుతి రుతుపవనాలు తిరోగమనమై.. ఈశాన్య రుతుపవనాలు ప్రా రంభంకావడంతో చలికాలం ప్రారంభమవుతు ంది. ఈ ప్రక్రియలో వచ్చిన మార్పుల వల్ల ఉత్తర తెలంగాణలో సాధారణం కంటే ఒక డిగ్రీ సెంట్రీగేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుందని ఐఎండీ చె ప్పింది.

ఇక దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో సాధారణం కంటే ఒక డిగ్రీ సెంట్రీగేడ్ ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అయితే తెలంగాణ మొత్తం పగలు మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అలాగే, ఈ సీజన్‌లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

హైదరాబాద్‌లో వచ్చే నాలుగు నెలలపాటు ఉష్ణోగ్రతల అంచనాలు

నెల               గరిష్ఠ/కనిష్ఠ

నవంబర్ 30/17

డిసెంబర్ 29/15

జనవరి 29/16

ఫిబ్రవరి 32/18