calender_icon.png 22 October, 2024 | 6:56 PM

పెర్ఫ్యూమ్.. డియోడరెంట్‌కు తేడా?

24-06-2024 12:00:00 AM

తాజాదనం కోసం చాలామంది పెర్ఫ్యూమ్, డియోడరెంట్లను ఉపయోగిస్తారు. ముఖ్యంగా చెమటతో ఇబ్బంది పడేవారు వీటిలో ఏదో ఒకటి తప్పని సరిగా వాడతారు. అసలు పెర్ఫ్యూమ్, డియోడరెంట్ రెండూ సువాసన కోసం ఉపయోగిస్తారు. తాజాదనం, సువాసన కోసం కొంతమంది పెర్ఫ్యూమ్ లేదా డియోడరెంట్‌ను రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు ఉపయోగిస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు అధిక చెమట కారణంగా దాని ప్రభావం తగ్గుతుంది. అసలు రెండింటి మధ్య తేడా ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. 

పెర్ఫ్యూమ్‌లో 15-30 శాతం ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. ఇది ఎక్కువ కాలం వాసన ఉండేలా చేస్తుంది. డియోడరెంట్‌లో ఎసెన్షియల్ ఆయిల్స్ 1-2 శాతం మాత్రమే ఉంటాయి. ఈ కారణంగా పెర్ఫ్యూమ్ సువాసన మరింత కఠినంగా ఉంటుంది. డియోడరెంట్లలో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్లు, సువాసనలు ఉంటాయి. ఇవి చెమట వాసనను నియంత్రించడంలో సహాయపడతాయి. 

సువాసన పరంగా పెర్ఫ్యూమ్ డియోడరెంట్ల కంటే బలంగా, ఎక్కువ కాలం ఉంటాయి. డియోడరెంట్ సువాసన నాలుగు గంటల పాటు ఉంటుంది. పెర్ఫ్యూమ్ సువాసన దాదాపు 12 గంటల పాటు ఉంటుంది. ఇది వర్తించే విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది. పెర్ఫ్యూమ్‌లో పెద్ద మొత్తంలో కాన్సన్‌ట్రేషన్ ఉంటుంది. పెర్ఫ్యూమ్‌ను చర్మంపై నేరుగా వాడొద్దు. దీన్ని  బట్టలపై మాత్రమే వేసుకోవాలి. అండర్ ఆర్మ్స్ వంటి విపరీతమైన చెమట ఉన్న ప్రదేశాలలో డియోడరెంట్ వాడాలి.