calender_icon.png 24 November, 2024 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహార అలవాట్లతోనే యువకుల్లోనూ డయాబెటీస్

14-11-2024 02:55:04 AM

నాసా దవాఖానా వైద్యులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13 (విజయక్రాంతి): ఆహార అలవాట్ల కారణంగానే యువతలోనూ డయాబెటీస్ వస్తుం దని, ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించి చికిత్స చేయించుకుంటే ఎలాంటి నష్టం ఉండదని నాసా దవాఖాన వైద్యులు కార్తీక్, నవీన్‌కుమార్, రాకేశ్ తెలిపారు. నవంబర్ 14న వరల్డ్ డయాబెటీస్ డేని పురస్కరించుకొని ఎల్‌బీనగర్ సమీపంలోని చింతల కుంట ఉన్న నాసా ఆసుపత్రిలో తక్కువ ధరలకే నిర్వహించే డయాబెటీస్ పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా వారు డయాబెటీస్ పరీక్షల బ్రోచర్‌ను బుధవారం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ డయాబెటీస్ రోజురోజుకి పెరిగిపో తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేవలం సీనియర్ సిటిజన్స్ మాత్ర మే డయాబెటీస్ బారిన పడేవారన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఎప్పటికప్పుడు షుగర్ టెస్టులు చేయించుకోవాలన్నారు.  వైద్యుల సూచనల మేరకు పరీక్షల అనంతరం మందులు వాడాలని చెప్పారు.